హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడింది. శుక్రవారం సాయంత్రం దాదాపు రెండు గంటలకు పైగా కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోయింది. నగరంలోని యూసఫ్‌గూడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, నల్లకుంట, భాగ్‌లింగంపల్లి, గాంధీనగర్, కాచిగూడ, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, సైదాబాద్, సంతోశ్ నగర్, చాంద్రయాణగుట్ట, ఫలక్‌నుమా, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయం కోసం.. 040- 2111 1111కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.