హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. రహదారులు జలమయం

హైదారాబాద్ (CLiC2NEWS): నగరంలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. మూడు రోజుల విరామం తర్వాత హైదారాబాద్‌లో మరోసారి వర్షం భారీగా కురిసింది. ఉదయం నుండి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహానదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్రారడైజ్, బేగంపేట్ పలు ప్రాంతాలలో నీరు రోడ్లపై నిలిచిపోయింది. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, ట్రూప్ బజార్, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్‌లలో జోరు వర్షం కురుస్తోంది. మరో రెండ్రోజుల పాటు నగరానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి రావొద్దని, గంట తర్వాత వాహనదారులు రోడ్లపై ప్రయాణించాలని సూచించారు.