హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం
హైదరాబాద్ (CLiC2NEWS): భాగ్యనరంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. నగరంలోని చోట్ల సాయంత్రం వర్షం దంచి కొట్టింది. గత కొన్ని రోజుల నుంచి ఎండవేడి ఎక్కువైన విషయం తెలిసిందే. గురువారం కురిసిన వర్షంతో నగరవాసికి ఉక్కపోతనుంచి కాస్త ఉపశమనం కలిగింది.
బాగ్లింగంపల్లి, రాంనగర్, కాప్రా, మల్కాజ్గిరి, మౌలాలి, బేగంపేట, తార్నాక, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కూకట్పల్లి, కెపిహెచ్బి కాలనీ, బాలానగర్, మియాపూర్ తో పాటు పలు ప్రాంతాల్లో వాన భారీగా కురిసింది.