హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం తెల్లవారు జామున వర్షం దంచి కొట్టింది. నగరంలోని పలు చోట్ల దాదాపు గంటన్నర పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం తో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. కాగా ఈ వర్షంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కాగా సోమవారం మొత్తం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం సమయంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది