హైదరాబాద్లో భారీ వర్షం
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/rains.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్లో ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జిహెచ్ ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.