హైదరాబాద్‌లో భారీ వర్షం..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో గురువారం మధ్యాహ్నం పలుచోట్ల భారీ వర్షం కురింసింది. సుమారు రెండు గంటలపాటు తెరపి లేకుండా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బినగర్ , నాగోలు, చైతన్యపురి, గడ్డి అన్నారం, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపైకి భారీగా చేరుకుంది. లోతట్ట ప్రాంతాలు జలమయమయ్యాయి. జిహెచ్ ఎంసి విపత్తు సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించారు.