హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటకు రావొద్దు

హైదరాబాద్‌ (CLiC2NEWS): నగరంలో భారీ వ‌ర్షం కురుస్తోంది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట, కాచ్చిగూడ, నల్లకుంట, గోల్నాకలో వాన పడుతున్నది. ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, ఎల్‌బీనగర్‌, కోఠీ, అబిడ్స్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, హైరదాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ప్రగతినగర్‌, నిజాంపేట, చంపాపేట, రామంతాపూర్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, మేడిపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, దుండిగల్‌, కుత్బుల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

హైద‌రాబాద్‌లో ఇవాళ రాత్రి 9 గంటల వరకు వర్షం పడుతుందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. నగరవాసులు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర సమయంలో సాయం కోసం 040-29555500 నంబర్‌లో సంప్రదించాలని కోరింది.

అంబ‌ర్‌పేట‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ముస‌రాంబాగ్ బ్రిడ్జి మీదుగా మూసీ వ‌ర‌ద నీరు భారీగా ప్ర‌వ‌హిస్తోంది. ముందస్తు జాగ్ర‌త్త‌గా అధికారులు బ్ర‌డ్జిపై రాక‌పోక‌లు నిలిపివేయ‌డంతో ఇరువైపులా వాహ‌నాలు భారీగా నిలిచిపోయాయి. అలాగే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర‌కు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వ‌ర్షం నేప‌థ్యంలో జిహెచ్ ఎంసి అధికారుల‌ను మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి అప్ర‌మ‌త్తం చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ప్ర‌త్యేక బృందాల‌ను రంగంలోకి దించారు.

Leave A Reply

Your email address will not be published.