హైదరాబాద్‌లో భారీ వర్షం!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ (గురువారం) సాయంత్రం భారీవర్షం కురిసింది. సాయంత్రం పూట నగరంలోని పలు చోట్ల భారీవర్షం కురిసింది. ఒక్కసారిగా దట్టమైన మేఘలు కమ్ముకొని కుంభవృష్టి కురిసింది. నగరంలోని బాగ్‌లింగంపల్లి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, కోఠీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, మలక్‌పేట ఖైరతాబాద్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. కాగా భారీ వర్షంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా మరో రెండు గంటల్లో నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.