విజయవాడలో భారీ వార్షం

విజయవాడ (CLiC2NEWS): విజయవాడ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే గత వర్షాల మూలంగా విజయవాడ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (శనివారం) కురిసిన భారీ వర్షంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతోంది.
బుడమేరు గండ్లను అధికారులు పూడ్చి వేశారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చివేసిన అధికారులు తాజాగా మరో గండిని కూడా పూడ్చి వేశారు. దీంతో దిగువకు ప్రవహించే నీటి ప్రవాహం ఆగిపోయింది.