దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు
![](https://clic2news.com/wp-content/uploads/2021/05/rain-in-hyd.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఎపి, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్, హింగోలి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటకలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మహారాష్ట్రలోని గడిచ్చిరౌలి జిల్లాలో 130 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాతాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. యుపి, ఒడిశా, గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్ణటాకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.