వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు..

విశాఖపట్నం (CLiC2NEWS) : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడుతోంది. గంటకు సుమారు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఎపి విపత్తుల నిర్వమణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈరోజు ఆర్థరాత్రి నుండి తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సోమవారం వరకు చేపలవేటకు వెళ్లరాదని అధికారులు తెలిపారు.