ఎపిలో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు

విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్సాలతో విశాఖపట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. కలెక్టర్ సృజన ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో కూడా విద్యాసంస్థలు సెలవులు ప్రకటించారు. భారీ వరదల మూలంగా ప్రకాశం బ్యారేజిలో మొత్తం 70 గేట్లను ఎత్తి 3,32,374 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
విజయవాడలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలో ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. నందిగామ మండలంలో శుక్రవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు నల్లవాడు వైరా, కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాములూరు – వీరుల పాడు మధ్య రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.