హైదరాబాద్ (CLiC2NEWS): ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు (ఆదివారం) భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఉపరితల ద్రోణి జార్ఖండ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు విస్తరించి ఉంది. ఈ ధ్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశలనుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.