ఉత్తరాదిలో భారీ వర్షాలు.. ఒక్కరోజులో 28 మంది మృతి

ఢిల్లీ (CLiC2NEWS): ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఆదివారం ఒక్కరోజే 28 ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రాజస్థాన్, పంజాబ్, హరియాణా , ఢిల్లీతో పాటు పలు చోట్ల అనేక ఆస్థినష్టం వాటిల్లింది. రాజస్థాన్‌లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లోనూ వర్షాలు కారణంగా పలువురు మృతి చెందారు . దేశ రాజధాని ఢిల్లీలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. మరోవైపు మిలీనియమ్ సిటీగా పేరొందిన గుర్‌గ్రామ్‌లో అనేక సెక్టార్లు అంతా వరద నీటితో జలమయ్యాయి. ఆరుణాచల్, పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లోనూ ఆదివారం నుండ భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం.