పాకిస్థాన్లో భారీ వర్షాలు.. 203 మంది మృతి
Rain effect : పాకిస్థాన్లో కురుస్తున్న భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 203 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 562 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజా రవాణాకు కూడా ఆటంకం ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి.