తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో నేడు భారీ వ‌ర్షాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అస‌ని తుఫాన్ బ‌ల‌హీన ప‌డింది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో తెలంగాణ‌లోని మంచిర్యాల‌, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్‌, ములు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారి శ్రావ‌ణి తెలిపారు.

ఒక ప‌క్క తుఫాన్ ప్ర‌భావంతో ప‌లు చోట్ల వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డుతుంటే.. మ‌రో వైపు అధికంగా న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌తో సూర్యుడు ప్ర‌తాపం చూపిస్తున్నాడు. కుమురం భీం జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం భ‌ట్టుప‌ల్లి, సీతాపురానికి చెందిన రామ‌గిరి పోచుబాయి (58), వ‌న‌ప‌ర్తి జిల్లా చ‌న్నంబావి మండ‌లంలోని వెలుగొండ‌కు చెందిన గుమ్మ‌డం ఎల్ల‌మ్మ (65) మంగ‌ళ‌వారం వ‌డ‌దెబ్బ‌తో మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.