నేడు, రేపు భారీ వర్షాలు
హైదరాబాద్ (CLiC2NEWS): పశ్చిమబెంగాల్లో సోమవారం ఏర్పడిన అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరిత ఆవర్తనం ఏర్పడి నైరుతి దిశకు తిరిగింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలుకురుస్తున్నాయి. మంగళవారం, బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 13.2 సెంటిమీటర్లు, పాతరాజంపేటలో 12.7, పొచ్చెరలో 10.4, నెన్నెల 9.7, సోనాల 9.4, జైనూర్ 9.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.