తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం.. 3 కి.మీ. మేర క్యూలైన్లు

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు భ‌క్తం జ‌నం పోటెత్తారు. వేస‌వి సెల‌వులు కావ‌డంతో తిరుమ‌ల‌లో ఎటు చూసినా భ‌క్త‌జ‌న సందోహం క‌నిపిస్తోంది. శ్రీ వారిని ద‌ర్శించుకునేందుకు సామాన్య భ‌క్తుల‌కు 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నంలోని షెడ్‌లు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. ఔట‌ర్ రింగురోడ్ఉలో 3 కిలోమీట‌ర్ల మేర భ‌క్తులు వేచి ఉన్నారు. వారికి టిటిడి సిబ్బంది తాగునీరు, అల్పాహారం అంద‌జేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.