సాయిధరమ్ తేజ్ ఉదారత.. ఇద్దరు చిన్నారుల చికిత్సకు సాయం

హైదరాబాద్ (CLiC2NEWS): మెగాహీరో సాయిధరమ్ తేజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో సైనిక కుటుంబాలకు, ఎపి, తెలంగాణ పోలీసులకు రూ.20 లక్షలు సాయం అందించారు. అనేక సార్లు పలువురికి సాయం అందించి తన మంచి మనసు చాటుకున్నారాయన. సామాజిక కార్యక్రమాల్లో ముందుండే ఆయన తాజాగా సూర్యాపేట జిల్లాలోని చార్లెట్ అనాథ ఆశ్రమంలో ఉండే ఇద్దరు చిన్నారుల చికిత్సకు సాయం అందించారు. ఒక్క మెసేజ్ పెట్టగానే ఏం ఆలోచించకుండా హెల్ప్ చేశారని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ సోషల్‌మీడియా వేదికగా తెలిపారు.