హీరో నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్ధం..

హైదరాబాద్ (CLiC2NEWS): హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్ధం గురువారం జరిగింది. ఈ విషయాన్ని నటుడు నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నామన్నారు. వారి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది అని పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. శోభితా ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్.. 2016లో సినీరంగంలోకి ప్రవేశించారు.