సచిన్ ఔటయ్యాడంటే టివిలు ఆపేసేవాళ్లం: నాని
విశాఖ (CLiC2NEWS): భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసినదే. మ్యాచ్ ప్రారంభానికి ముందు సినీ హీరో నాని విశాఖ స్టేడియంలో సందడి చేశారు. ఆయన నటించిన సినిమా దసరా ప్రచారంలో భాగంగా స్టేడియంకు వచ్చారు. తనకు బాగా ఇష్టమైన క్రికెటర్ సచిన్ అని.. మ్యాచ్ జరిగేటపుడు సచిన్ ఔట్ అయితే టీవీలు ఆపేసేవాళ్లమని చెప్పాడు. నాని మ్యాచ్ ప్రారంభానికి ముందు మాజీ క్రికెటర్లు సనీల్ గావస్కర్, ఎమ్ ఎస్ కె ప్రసాద్‌తో మాట్లాడారు. , ఆరోన్ ఫించ్‌కు దసరా చిత్రంలోని ధూమ్ ధామ్.. సిగ్నేచర్ స్టెప్‌ను నాని నేర్పించాడు. ఇద్దరూ కలిసి స్టెప్ వేసేసరికి స్టేడియంలో ఒక్కసారిగా ఈలలు మోగాయి. అంతేకాకుండా అంతేకాకుండా టీమ్ ఇండియా స్టార్‌లకు తన సినిమా టైటిల్స్ కూడా పెట్టాడు.కెప్టెన్ రోహిత్ శర్మకు జెంటిల్‌మెన్ టైటిల్, విరాట్‌కు గ్యాంగ్‌లీడర్, హార్దిక్ పాండ్ పిల్లజమిందార్ టైటిల్ బాగుంటాయన్నాడు.