లవ్ యూ మై డియర్ డాక్టర్ రామ్ చరణ్.. చిరంజీవి
హైదరాబాద్ (CLiC2NEWS): రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైకు చెందిన వేల్స్ యూనివర్సిటి, హీరో రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందించింది. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం రోజున ఆయనకు డాక్టరేట్ అందజేయనున్నారన్న విషయం తెలిసిందే. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్బంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి డాక్టరేట్ అందించిన వేల్స్ యూనివర్సిటి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతమంది గ్రాడ్యుయేట్స్ మధ్యలో ఇలా నిల్చోవడ ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిజానికి ఇది నాకు దక్కిన గౌరవం కాదని.. నా అభిమానులది, దర్శకనిర్మాతలది, నాతోటి నటీనటులదని రామ్ చరణ్ అన్నారు.
రామ్ చరణ్ డాక్టరేట్ అందుకోవడం.. ఎంతో గర్వంగా ఉందని.. తండ్రిగా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చిరంజీవి అన్నారు. ఇవి భావోద్వేగంతో కూడిన క్షణాలని, చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. లవ్యు మై డియర్ డాక్టర్ రామ్‌చరణ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
A momentous occasion to be cherished forever 💥
𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐒𝐭𝐚𝐫 @AlwaysRamCharan Garu received the honorary Doctorate @ VELS University’s 14th convocation ceremony. #GlobalStarRamCharan #RamCharan #GameChanger #RC16 #RC17 pic.twitter.com/NeqUVAhrFz
— BA Raju’s Team (@baraju_SuperHit) April 13, 2024