అభిమాని కుటుంబానికి అండ‌గా.. సూర్య‌

చెన్నై (CLiC2NEWS): హీరోసూర్య మ‌రోసారి త‌న ఔదార్యాన్ని చాటుకున్నాడు. కోలీవుడ్ హీరో సూర్య భాష‌తో సంబంధం లేకుండా అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. విభిన్న‌మైన క‌థ‌ల‌తో దూసుకుపోతున్న సూర్య త‌న అభిమానుల‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ల‌కు అండ‌గా ఉంటాడు. తాజాగా మ‌రోసారి త‌న అభిమాని కుటుంబానికి అండ‌గా నిలిచి మంచి మ‌న‌సు చాటుకున్నాడు. త‌మిళ‌నాడుకు చెందిన జ‌గ‌దీవ్ అనే వ్య‌క్తి రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందాడు. అత‌డు సూర్యు వీరాభిమాని. ఈ విష‌యం తెలుసుకున్న సూర్య జ‌గ‌దీశ్ ఇంటికి వెళ్లి కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడాడు. జ‌గ‌దీశ్ భార్య‌కు ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేస్తాన‌ని, అత‌ని కూతురి బాధ్య‌త‌ను తీసుకుంటాన‌ని ఆమె చ‌దువుకు అయ్యే ఖ‌ర్చంతా భ‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.