కెరీర్‌ని పీక్‌లో వదిలేసి వచ్చా.. విజయ్

చెన్నై (CLiC2NEWS): సినిమా కెరీర్లో అత్యున్నత స్థాయిన వదిలేసి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని సిని నటుడు విజయ్ అన్నారు. విజయ్ తమిళగ వెట్రి కళగం (టివికె) పార్టీ మొదటి సమావేశం విల్లుపురం సమీపంలో నిర్వహించారు. పార్టి మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. విజయ్ తమ పార్టి భావజాలాన్ని, సిద్ధాంతాలను సభలో ప్రకటించారు. నాకు రాజకీయ అనుభం లేకపోవచ్చు.. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో భయపడనని అన్నారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అన్నారు.
రాజకీయ అనుభం లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారని, రాజకీయ అనుభవం లేకున్నా.. అమితమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నానని విజయ్ అన్నారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని, తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లులాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే యా భావజాలం అన్నారు. వాటి ఆధారంగానే పని చేస్తామని, పెరియార్ ఇవి రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టిని ముందుకు తీసుకెళ్తామన్నారు. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్ , సక్సెస్ స్టోరీలు చదివిన అనంతరం నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డానన్నారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తి స్థాయిలో మెజార్టితో గెలిపిస్తారని విశ్వసిస్తున్నాని అయన అన్నారు.
టివికె పార్టి నేత ప్రొఫెసర్ సంపత్.. పార్టి సిద్దాంతాలు, విధానాలను వివరించారు. పుట్టుకతోనే మనుషులంతా సమానమని, సమ సమాజాన్ని సృష్టించడమే పార్టి లక్ష్యమన్నారు. దీంతో పాటు సెక్యులరిజం, రాష్ట్ర స్వయంప్రతిపత్తి, సమ్మిళిత అభివృద్ధి, ద్వాభాషా విధానం, అవినీపై పోరాటం, తిరోగమన ఆలచనల తిరస్కరణ, మాదక ద్రవ్యాల రహిత తమిళనాడు వంటివి ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు. అనంతరం పార్టి మరో నేత కేథరిన్ మాట్లాడుతూ.. విద్యాను రాష్ట్ర జాబితాలోకి మార్చేందుకు ఒత్తిడిచేయడం, మదురైలో సచివాలయం శాఖ ఏర్పాటు, కుల గణన, గవర్నర్ పదవి రద్దుకు ప్రతిపాదన, మూడింట ఒక వంతు స్థానాలు మహిళలకు కేటాయించడం వంటివి తమ పార్టి లక్ష్యాలుగా పేర్కొన్నారు.