శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.22 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత

హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ నుండి దోహ మీదుగా హైదరాబాద్ చేరుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా ప్రయాణికురాలి నుండి 3.12 కిలోల హెరాయిన్‌ను డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఎటువంటి అనుమానం రాకుండా హెరాయిన్‌ను రెండు తెల్లటి కవర్స్‌లో చుట్టి ట్రాలీబ్యాగ్ కింది భాగంలో దాచి తీసుకొచ్చింది. ఆమె లగేజీని తనిఖీ చేసిన అధికారులు హెరాయిన్‌ను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ సుమారు రూ. 21.90 కోట్లు ఉంటుందని అధికారులు అంచానా వేశారు. ప్రయాణికురాలిపై కేసు నమోదు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.