ఫార్మాసిటి భూసేకరణ నోటిఫికేషన్ రద్దు: హైకోర్టు
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/high-court.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): మేడిపల్లి, కుర్మద్ధలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ నోటిఫికేషన్లను హైకోర్టు రద్దు చేసింది. భూసేకరణ విషయంలో అధికారుల తీరుపై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఫార్మాసిటి భూసేకరణలో అధికారుల తీరు ఆశ్చర్యంగా ఉందని.. రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ ఇచ్చిన మెమోను పక్కన పెట్టారు. కోర్టుల్లో కేసులు దాఖలైనా ఎందుకు తేరుకోవడం లేదని, తప్పులు కప్పిపుచ్చుకునే బదులు సవరించుకుంటే మంచిదని తెలిపింది. అధికారులు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా అంటూ ప్రశ్నించింది. పిటిషనర్లు లేవనెత్తిన లోపాలను సరిచేసి ఉంటే మూడేళ్లు వృథా అయ్యేది కాదు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని భూసేకరణ తిరిగి ప్రారంభించాలని, నిర్వాసితులు వారివారి అభ్యంతరాలను రెండు వారాల్లో తెలిపి భూసేకరణకు సహకరించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.