హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంపై స్పష్టత నిచ్చిన హైకోర్టు

హైదరాబాద్ (CLiC2NEWS): హుస్సేన్ సాగరల్‌లో గణపతులు నిమజ్జన వేడుకలపై ఉన్నత న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. 2021 లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. మట్టి, ఎకో ప్రెండ్లీ విగ్రహాల మాత్రమే నిమజ్జనం చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పిఒపి విగ్రహాలను జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది.
మరోవైపు సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనాలను అనుమతించడం లేదని ట్యాంక్‌బండ్‌పై ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతి 100 మీటర్లకు ఒక ప్లెక్సీని ఏర్పాటు చేసి భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.