చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత: హైకోర్టు

అమరావతి (CLiC2NEW): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్లను కొట్టివేసింది.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఎస్ ఎల్‌పిని దాఖలు చేయాగా.. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.