హైకోర్టులో మాజి సిఎం కెసిఆర్ పిటిష‌న్

హైద‌రాబాద్ (CLiC2NEWS):  జ‌స్టిస్ పిసి ఘోష్ క‌మిష‌న్ నివేదిక‌ను కొట్టివేయాల‌ని మాజి ముఖ్య‌మంత్రి కెసిఆర్, హ‌రీశ్‌రావు .. రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కాళేశ్వ‌రంపై జ‌స్టిస్ పిసి ఘోష్ క‌మిష‌న్ కు విచార‌ణ అర్హ‌త లేద‌ని, క‌మిష‌న్ నివేదిక‌ను కొట్టివేయాల‌ని కోరారు. త‌మ విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. . ఈ పిటిష‌న్ ప్ర‌స్తుతం రిజిస్ట్రీ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై జ‌స్టిస్ పిసి ఘోష్ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించిన విష‌యం తెలిసిందే. బిఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో కాళేశ్వ‌రం, సుందిళ్ల‌, మేడిగ‌డ్డ ప్రాజెక్టుల నిర్మాణం జ‌రిగింది. అయితే, 2023 అక్టోబ‌ర్లో మేడిగ‌డ్డ బ్యారేజి పిల్ల‌ర్లు కిందికి కుంగాయి. దీనిపై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై నివేదిక త‌యారు చేయాల‌ని జ‌స్టిస్ పిసి ఘోష్ క‌మిష‌న్‌ను అప్ప‌గించింది.

 

గ‌ణేశుడి విగ్ర‌హం త‌ర‌లిస్తుండ‌గా ప్ర‌మాదం: ముగ్గురు మృతి

3 Comments
  1. […] Also Read: హైకోర్టులో మ‌జి సిఎం కెసిఆర్ పిటిష‌న… […]

  2. […] Alsgo read : హైకోర్టులో మాజి సిఎం కెసిఆర్ పిటిష‌న… […]

  3. […] Also Read: హైకోర్టులో మాజి సిఎం కెసిఆర్ పిటిష‌న… […]

Leave A Reply

Your email address will not be published.