రాజాసింగ్‌పై పిడి యాక్టు.. ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు

హైద‌రాబాద్ (CLiC2NEWS) రాష్ట్ర ప్ర‌భుత్వం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పిడి యాక్టు అమ‌లు చేయ‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హోంశాఖ కార్య‌ద‌ర్శికి, హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌కు నోటీసులు ఇచ్చింది. అనంత‌రం కేసును నాలుగు వారాల‌కు వాయిదా వేసింది.  రాజాసింగ్ భార్య ఉషాబాయి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. త‌న భ‌ర్త‌పై పోలీసులు  న‌మోదు చేసిన ఒక కేసులో నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. మిగ‌తా రెండు పాత కేసుల్లో నోటీసుల‌కు స‌మ‌యం కూడా ఇవ్వ‌లేద‌ని ఆమె పిటిష‌న్‌లో పేర్కొన్న‌ట్లు   అమె త‌ర‌పు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.