TS: గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల పునఃప్రారంభించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు తెరవాలని, గతంలో ఉన్న స్టే ఎత్తివేయాలని హైకోర్టును కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ మిగతాపాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ పిటీషన్ పై సిజె ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. గురుకులాలను తెరవొద్దన్న మునుపటి ఆదేశాలను సవరిస్తూ గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్‌లైన్ బోధన చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది.
No chance reopen the school,s so many students suffering from covid-19 so please don’t reopen hostels iam reguesting to high court
No chance reopen the schools
Not chance to reopen the all schools not only gurukulam