రేపు బిజెపి చేపట్టే మహాధర్నాకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో భారతీయ జనతా పార్టీ శనివారం చేపట్టే మహాధర్నాకు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజి వ్యవహారంపై బిజెపి శనివారం మహాధర్నా చేపట్టేందుకు పోలీసులు నిరాకరించడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇందిరాపార్క్ వద్ద చేపట్టే మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతిచ్చింది. ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని సూచించింది. అంతేకాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.