ఈ నెల 28న బిఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్ (CLiC2NEWS): నల్గొండలో బిఆర్ఎస్ రైతు మహాధర్నాకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుమతి నిచ్చింది. జనవరి 28వ తేదీన నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో రైతు మహాధర్నా నిర్వహించాలని బిఆర్ ఎస్ నిర్ణయించింది. ఈ ధర్నాకు పోలీసులు అధికారులు అనుమతి మంజూరు చేయలేదు. దీంతో బిఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రైతు ధర్నా అనుమతి కోసం న్యాయస్థానంలో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 28వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మమాధర్నా కార్యక్రమానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైతు మహాధర్నాకు బిఆర్ ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో పాటు పలువులు నాయకులు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నల్గొండలో బిఆర్ఎస్ పార్టి రైతు మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ.. పోలీసులు అనుమతి నిరాకరించారు.