రోజుకు లక్ష ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేయండి
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం మరోసారి హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రోజుకు ఆర్‌టిపిసిఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆర్‌టిపిసిఆర్-ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తప్పకుండా పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరం అని కోర్టు అభిప్రాయపడింది.
తెలంగాణలో కరోనా నియంత్రణపై ఇవాళ (సోమవారం) రాష్ట్ర మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఎజి కోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.
హైకోర్టులో రేపటినుంచి వర్చువల్ గా కేసుల విచారణ
హైకోర్టులో రేపటినుంచి వర్చువల్ గా కేసుల విచారణ జరపనున్నారు. ఆన్ లైన్ లోనే పూర్తి స్టాయి విచారణలు జరుపనున్నట్లు కోర్టు తెలిపింది.