వేముల‌వాడ రాజన్నను ద‌ర్శించ‌కున్న‌ హైకోర్టు జడ్జి మాధవి రెడ్డి

వేముల‌వాడ (CLiC2NEWS): రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేముల‌వాడ‌లో కొలువైన శ్రీ రాజరాజేశ్వర సామివారిని తెలంగాణ‌ హైకోర్టు జడ్జి మాధవి రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.

ఆల‌యంలో న్యాయమూర్తి దంపతులు ముందుగా కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంత‌రం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారి కల్యాణ మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను న్యాయ‌మూర్తికి అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.