టిఆర్ఎస్ అధినేత‌, సిఎం కెసిఆర్ కు హైకోర్టు నోటీసులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్ లో తెలంగాణ‌రాష్ట్ర స‌మితికి భూమి కేటాయింపుల‌పై హైకోర్టులో విచార‌ణ జరిగింది. జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్యాల‌యాల‌కు భూమి కేటాయింపుల‌ను స‌వాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మ‌హేశ్వ‌ర్‌రాజ్ దాఖ‌లుచేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంపై ఉన్న‌త న్యాయ‌స్థానం విచ‌ర‌ణ చేప్ట‌టింది.

పిటిష‌న‌ర్ టిఆర్ ఎస్ హైద‌రాబాద్ కార్యాల‌యం కోసం 4,935 గ‌జాలు ఇవ్వ‌డం.. అత్యంత విలువైన భూమిని రూ. 100ల‌కే గ‌జం చొప్పున కేటాయించ‌డాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ వాజ్యంపై విచార‌ణ చేప‌ట్టిన ఉన్న‌త న్యాయ‌స్థానం టిఆర్ ఎస్ అధినేత‌, సిఎం కెసిఆర్‌, , పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస్‌రెడ్డితో పాటు సిఎస్‌, సిసిఎల్ఎ, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ కు హైకోర్టునోటీసులు ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.