వైద్య‌విద్యార్థిని ప్రీతి మృతికి కార‌ణ‌మైన వ్య‌క్తిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నారు?: హైకోర్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): వ‌రంగ‌ల్ కెఎంసిలో పిజి వైద్య‌విద్యార్థిని ప్రీతి మృతిపై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వ్య‌క్తి పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఎస్‌టి ఉద్యోగుల సంఘం సంక్షేమ అధ్య‌క్షుడు మ‌ల్ల‌య్య రాసిన లేఖ‌ను ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. బాధ్యుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని, సిబిఐతో ద‌ర్యాప్తు చేయించాల‌ని లేఖ‌లో కోరారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయ‌మూర్తితో ప‌ర్య‌వేక్షించేలా చూడాల‌ని మ‌ల్ల‌య్య లేఖలో పేర్కొన్నారు.

ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం.. ప్రీతి మృతికి కార‌ణ‌మైన వ్య‌క్తిపై ఎలాంటి చ‌ర్యులు తీసుకున్నారో తెల‌పాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ద‌ర్యాప్తున‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల‌లో ర్యాగింగ్ నివార‌ణ‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాన‌లు ఏమేర‌కు అమ‌లు చేస్తున్నారో చెప్పాల‌ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన త‌దుప‌రి విచార‌ణ 2 వారాల‌కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.