జ‌య‌హో ధ్యాన్ చంద్‌

హైదరాబాద్ (CLiC2NEWS): భార‌త్ హాకీ సత్తాని యావ‌త్ ప్రపంచానికి తెలియ‌జేసిన ఘనత మ‌న మేజర్ ధ్యాన్ చంద్‌దే. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకి మాంత్రికుడు ధ్యాన్ చంద్‌. ఆయన పుట్టిన రోజు ఆగస్టు 29ను (నేడు) జాతీయ క్రీడాదినోత్సవం జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే జాతీయ క్రీడాదినోత్సవం గురించి చాలా మందికి తెలియదు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ దేశంలో అయినా క్రీడాకారులు ఘనంగా జరుపుకుంటారు. కానీ, భారత్ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ఇది మొక్కుబడిగానే సాగుతోంది. ఈ రోజు ధ్యాన్ చంద్ విగ్రహానికి దండలు వేసి అధికారులు, క్రీడాకారులు చేతులు దులుపుకుంటున్నారు. మ‌రో వైపు దేశంలో క్రీడా దినోత్సవం అంటే కేవలం హాకీ క్రీడాకారులకు చెందిన పండుగ‌గానే ప‌లువురు భావిస్తున్నారు.

ధ్యాన్‌చంద్ జీవితం..

1905 ఆగస్టు 29వతేదీన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలహాబాద్ లో జన్మించిన ధ్యాన్ చంద్ జవాన్ గా జీవితాన్ని ప్రారంభించారు. మధ్య ప్రదేశ్ లోని ధ్యాన్ చంన్చంద్నగరంలో పెరిగారు. ఆయన చిన్న తనం నుంచే హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. సైనికాధికారుల ప్రోత్సాహంతో చక్కటి ఆటగాడిగా ఎదిగిన ఆయన హాకీ స్టిక్ అతని చేతిలో మంత్రదండగా మారిపోతుంది. బంతిపై నియంత్రణ, డ్రిబ్లింగ్ చాతుర్యం, పాసింగ్లో అసాధారణ నైపుణ్యం ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్ చంద్ ని హాకీ మాంత్రికుడిగా చేశాయి. 1920లో బెల్జియలో జరిగిన ఒలంపిక్స్లో భారత జట్టు హాకీ క్రీడలో పాల్గొంది. 1928లో అమ్స ర్ డామ్ లో జరిగిన పోటీలలో భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించింది. 1936లో లాస్ ఎంజిల్స్లో జరిగిన పోటీలో అమెరికాపై ధ్యాన్చంద్ 9 గోల్స్ చేసి గెలిపించారు. ధ్యాన్ చంద్ ఆటకు ముగ్ధుడైన జర్మనీ ఛాన్స‌ల‌ర్ హిట్లర్ ధ్యాన్ చంద్ కు జర్మనీలో కల్నల్ హోదా ఇస్తామని విజ్ఞప్తి చేయగా ధ్యాన్ చంద్ తన మాతృదేశాన్ని వీడనని చెప్పటం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం.

అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో, క్రీడాభిమానుల్లో ఆయనకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని 1947లో తూర్పు ఆఫ్రికాలో పర్యటించిన భారత జట్టుకు సారధ్యం వహించమని ఒత్తిడి పెరిగింది. తూర్పు ఆఫ్రికా గుడ్విల్ టూర్ తరువాత హాకీ క్రీడకు స్వస్తి పలికిన ధ్యాన్ చంద్ కొంతకాలం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్్స‌ కోచ్ గా సేవలందించారు. 1948లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొన్న భారతజట్టుకు కోచ్ గా వ్యవహిరించి స్వర్ణం సాధించడంలో కీలకభూమిక పోషించారు.

ధ్యాన్ చంద్ గౌరవార్ధం బెర్లిన్లో అతడి శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి వీధికి ఈ హాకీ మాంత్రికుడి పేరు పెట్టారు. అంతటి క్రీడాఖ్యాతిని అర్జించిన మహోన్నత క్రీడాకారుడు 1979 డిసెంబరు 3న ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ధ్యాన్చంద్ జన్మదినమైన ఆగస్టు 29ని భారత ప్రభుత్వం జాతీయ క్రీడాదినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున రాష్ట్రపతి ప్రతి యేటా క్రీడాకారులకు అవార్డులను అందజేస్తున్నారు. ధ్యాన్ చంద్ (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్), అర్జున, ద్రోణాచార్య అవార్డులను అందించే వేడుక ఈసారి కూడా జరుగుతుంది. కానీ, ఈసారి ఖేల్ రత్న అవార్డుకు ఎవరినీ ఎంపిక చేయలేదు.

భార‌త హాకీకి స్వ‌ర్ణ యుగం

ధ్యాన్ చంద్ చరిత్ర, హాకీ క్రీడలో సాధించిన ఘన విజయాలు పాఠ్యాంశంగా చేర్చటం వలన బాల, బాలికల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతుతుంటారు. ఏది ఏమైనా ధ్యాన్ చంద్ లాంటి క్రీడాకారుడు భార‌త్‌లో జ‌న్మించ‌డం మ‌నం చేసుకున్న అదృష్టం. జాతీయ క్రీడగా గుర్తింపు పొందిన హాకీ క్రీడ ధ్యాన్ చంద్ త‌ర్వాత అంత‌గా రాణించ‌లేక‌పోతోంది. దానికి కార‌ణ‌ల‌నేకం అనుకోండి. కానీ ఇప్పుడు (2023) నూరుకోట్ల‌కు పైగా ఉన్న భార‌తీయుల‌కు చాలా మందికి హాకీ క్రీడ అంటే తెలియ‌దు.. దానికి కార‌ణ‌మేమిటో మ‌నంద‌రికి తెలిసిందే.. ఇప్పుడంతా క్రీడ‌లు అంటే కేవ‌లం క్రీకెట్‌లా త‌యారైంది. క్రికెట్ ఆట‌గాళ్ల‌కు ఉన్న క్రేజ్ ఇండియాలో ఎవ‌రికీ లేదు. పాపం ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడిగా పేరు తెచ్చ‌కున్నా కానీ ఆయ‌న కీర్తి కేవ‌లం పుస్త‌కాల‌కే ప‌రిమిత‌మైంది. ఈ రోజుల్లో ధ్యాన్ చంద్‌లాంటి ప్లేయ‌ర్ ఇండియాలో ఉండి ఆయ‌న్ని మ‌న మీడియా, నాయ‌కులు ఆకాశానికెత్తేవారు. ఏది ఏమైన ధ్యాన్ చంద్ కాలంలో భార‌త హాకీకి స్వ‌ర్ణ యుగం. కేవ‌లం ధ్యాన్‌చంద్ ప్ర‌తిభ‌తోనే 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు భార‌త్ సాధించి పెట్టారు అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.. ధ్యాన్ చంద్ సార్‌ దేశ క్రీడా రంగానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ వారికి ఘన నివాళి అర్పిస్తూ `CLiC2NEWS` యావ‌త్ పాఠ‌క‌లోకానికి, క్రీడాభిమానుల‌కు క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తోంది. జ‌య‌హో మేజ‌ర్ ధ్యాన్ చంద్‌.

-బి.పూర్ణిమా
అడ్వ‌కేట్‌

Leave A Reply

Your email address will not be published.