ఈ నెల 12న ‘మహాపాదయాత్ర’కు హైకోర్టు అనుమతి..
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/amaravathi-padayathra.jpg)
అమరావతి (CLiC2NEWS): ఎపి రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. అమరావతియే రాజధానిగా ఉండాలని రైతు ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా.. ఈ నెల 12వ తేదీన తలపెట్టిన మహాపాదయాత్రకు డిజిపి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పరిమిత ఆంక్షలతో రైతుల మహాపాదయాత్ర కొనసాగించవచ్చని తెలిపింది. పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది.
ఈ కేసును శుక్రవారం ధర్మాసనం విచారించింది. పాదయాత్రకు ఈ రోజే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు.. రైతుల దరఖాస్తును వెంటనే పరిశీలించి అనుమతులివ్యాలని పోలీసుశాఖను ఆదేశించింది. అదేవిధంగా పాదయాత్ర ముగింపు సభకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.