పార్టి ఫిరాంయించిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై హైకోర్టు కీల‌క‌ తీర్పు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్రంలో పార్టి ఫిరాయించిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై  ఉన్న‌త న్యాయ‌స్థానం కీల‌క తీర్పునిచ్చింది.  పార్టి మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానంలో ప‌లు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. వీటిపై న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. బిఆర్ ఎస్‌, బిజెపి నేత‌లు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. పార్టి మారిన దానం నాగేంద‌ర్‌, క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్రావుపై వేటు వేయాల‌ని బిఆర్ ఎస్ నేత‌లు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద‌గౌడ్ పిటిష‌న్ వేశారు. దానం పై అన‌ర్హ‌త వేట‌టు వేయాల‌ని బిజెపి ఎమ్మెల్యే మ‌హేశ్వ‌ర్‌రెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కోర్టులో సుదీర్థ‌వాద‌న‌లు కొన‌సాగాయి. ఈ విష‌యంలో సుప్రీంకోర్టు ఆదేశాల‌ను స్పీక‌ర్ ప‌ట్టించుకోవ‌డం లేదంటూ పిటిష‌న్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు.. నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్పీక‌ర్ కార్యాల‌యాన్ని ఆదేశించింది. అప్ప‌టిలోగా నిర్ణ‌యం తీసుకోక‌పోతే సుమోటో కేసుగా విచారిస్తామ‌ని న్యాయ‌స్థానం పేర్కొంది

Leave A Reply

Your email address will not be published.