గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్ (CLiC2NEWS): ఈ నెల (జూన్) 11వ తేదీన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్-1 ప్రీలిమ్స్ ఎగ్జామ్ వాయిదాకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్గామ్ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తు హైకోర్టు తీర్పును వెలువరించింది. దాంతో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్ -1 ప్రిలీమ్స్ ఎగ్జామ్ ఈ నెల 11న జరుగనుంది. ఈ మేరకు టిఎస్‌పిఎస్ సి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు.