నాలుగు రోజుల పాటు భానుడి భగభగలు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/High-temperatures.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండనున్నట్లు సమాచారం. తెలంగాణలో 14 జిల్లాల్లో ఆదివారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్గొండ జిల్లా ఘన్పూర్లో 41.9 డిగ్రీలు.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా దమ్ముపేటలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోవవారం నుండి 13వ తేదీ వరకు ఉష్టోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల నుండి నాలుగు డిగ్రీల వరకు పెరుగుతాయని.. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు సూచనలు జారీ చేశారు. 11వ తేదీన ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 12,13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రత అధికమవుతున్నట్లు సమాచారం.