ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సభకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్ (CLiC2NEWS): బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సభకు ఉన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. పాదయాత్ర ముగింపు సభ ఆగస్టు 27వ తేదీన హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు బిజెపి జాతీయ అధ్యక్షడు జెపి నడ్డా ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఈ సభకు పోలీసుల అనుమతి లేదని, దానివల్ల అనుమతి రద్దు చేస్తున్నట్లు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. దీంతో భారతీయ జనగా పార్టీ నాయకులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిగిన అనంతరం హైకోర్టు సభకు షరతులతో కూడిన అనుమతి నిచ్చింది. ఈ సభలపో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని ఆదేశించింది.