అగ్ర‌రాజ్యంలో ఉన్న‌త‌ చ‌ద‌వులు.. హైద‌రాబాద్‌లో ఆగ‌స్టు 16న ఎడ్యుకేష‌న్ ఫెయిర్‌

చెన్నై (CLiC2NEWS): అగ్ర‌రాజ్యంలో ఉన్న‌త చ‌దువులు చ‌దవాల‌నుకొనే భార‌తీయ విద్యార్థ‌లకు అవ‌స‌ర‌మైన స‌మ‌గ్ర స‌మాచారం అందించేందుకు ఎడ్యుకేష‌న్ ఫెయిర్ ల‌ను నిర్వ‌హించనున్నారు. హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ధాన న‌గరాల్లో ఆగ‌స్టు 16 నుండి 26 వ‌ర‌కు వీటిని నిర్వ‌హిస్తున్న‌ట్లు అమెరికా రాయ‌బార ప్రాంతీయ కార్యాల‌యం వెల్ల‌డించింది. ఎడ్యుకేష‌న్ యుఎస్ఎ పేరుతో అమెరికా ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతోంది.

దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాలైన ఢిల్లీ, ముంబ‌యి, అహ్మ‌దాబాద్‌, కోల్‌క‌తా, పుణె, బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ల‌లో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెన్నైలోని కాన్సులేట్ జ‌న‌ర‌ల్ వెల్ల‌డించారు. ముందుగా హైద‌రాబాద్ లో  ఆగ‌స్టు 16న,  చెన్నైలో 17వ తేదీన ఈ కార్యక్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. డిగ్రీ, పిజి, డాక్ట‌రేట్ ప్రోగ్రామ్‌ల‌లో అడ్మిష‌న్ కోసం చూసే విద్యార్థులు కోసం అమెరికాకు చెందిన దాదాపు 80 కిపైగా యూనివ‌ర్సిటీలు, కాలేజీల ప్ర‌తినిధులు ఈ ఫెయిర్‌లో అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. వీటికి ప్ర‌వేశం ఉచిత‌మ‌ని, రిజిస్ట్రేష‌న్ మాత్రం త‌ప్ప‌ని స‌రి చేశారు. మ‌రింత స‌మాచారం కొర‌కు https://bit.ly/EdUSAFair24Emb వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.