హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 58 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

Hindustan Aeronautics Ltd: నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో 58 నాన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదోతరగతి ఉత్తీర్ణత , పోస్టుకు సంబంధించి విభాగాలలో ఐటిఐ, ఇంజినీరింగ్ డిప్లోమా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. ఎస్‌సి , ఎస్‌టిలకు ఐదేళ్లు, ఒబిసి (ఎన్‌సిఎల్ ) లకు మూడేళల్లు , పిడబ్ల్యూబిడిలకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆపరేటర్‌కు నెలకు వేతనం రూ. 22,000 నుండి రూ. 23,000 వరకు ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30.