చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్

ఢిల్లీ (CLiC2NEWS): డబ్య్లుబిసి (మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్)లో భారత్ స్వర్ణాల పంట పండిస్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు చేజిక్కించుకున్న భారత్ తాజాగా మరో స్వర్ణాన్ని సాధించింది. తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడిని సాధించింది. వియత్సాంకు చెందిన న్యూయెస్ టాన్‌పై 5-0 తో విజయం సాధించింది. వరుసగా రెండో యేడాది కూడా వరల్డ్ చాంపియన్‌గా నిలిచి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది.