ఎపి వ్యాప్తంగా వ‌ర్షాలు.. విశాఖ‌, శ్రీ‌కాకుళం జిల్లాల్లో విద్యాసంస్థ‌లకు సెల‌వు

విశాఖ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం కారణంగా రేపు విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. విశాఖ‌, శ్రీ‌కాకుళం జిల్లాల్లో సోమ‌వారం విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ జిల్లాల క‌లెక్టర్లు వెల్ల‌డించారు. విశాఖ క‌లెక్ట‌రేట్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ పోలీసు , త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌హ‌కారం కావాల‌న్నా కింది ఫోన్ నెంబ‌ర్ల ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చు.

విశాఖ క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూమ్ 0891-2590102, 0891-2590100

విశాఖ పోలీసు కంట్రోల్ రూమ్ 0891-2565454
పెదగంట్యాడ త‌హ‌సీల్దార్ 9948821997
గాజువాక 8886471113
ఆనంద‌పురం 9700501860
భీమిలి 970388838
ప‌ద్మ‌నాభం 7569340226
చిన‌గ‌దిలి 9703124082
సీత‌మ్మ‌ధార 9182807140
గోపాల‌ప‌ట్నం త‌హ‌సీల్దార్ 7842717183
ముల‌గాడ 944055200
డ‌య‌ల్ 100, 112

Leave A Reply

Your email address will not be published.