తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 26,27 తేదీల్లో సెలవులు ప్రకటించింది. ఈ మేరక తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. జులై 20,21,22 తేదీల్లో వర్షాలు కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. బంగాళా ఖాతంలోని అల్పపీడనం తీవ్రంగా మారి.. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని వలన రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విద్యాశాఖ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని నిర్ణయించింది.