బ్యాంకులకు వరుసగా సెలవులు! ఎప్పుడెప్పుడంటే..?

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు వ‌రుస సెల‌వులు ఉన్న‌ట్లు బ్యాంకు ఉన్న‌తాధికారులు తెలిపారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి త‌మ అవ‌స‌రాల‌కు ఇబ్బంది రాకుండా చూసుకోవాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు. ఆదివారాలు, పండుగ ప‌ర్వ‌దినాలు కాకుండా రెండో, నాలుగో శ‌నివారాలు బ్యాంకుల‌కు సెల‌వులు. న‌వంబ‌రు నెల ప్రారంభంలోనే బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడూ అనే విషయాలను ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రాల వారిగా సెలవులు మారుతూ ఉంటాయి. అందుకే బ్యాంకులో పని ఉన్న సమయంలో బ్యాంక్ సెలవుల గురించి తెలుకోవాల్సి ఉంటుంది.

ఈ వారం బ్యాంకులకు సెల‌వులు చాలానే ఉన్నాయి.

  • నవంబర్ 11న ఛత్ పూజా కారణంగా పాట్నాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • నవంబర్ 12న వంగల పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ పండుగను మేఘాలయ రాష్ట్రంలో మాత్రమే జరుపుకుంటారు.
  • నవంబర్ 13న రెండవ శనివారం.
  • నవంబర్ 14న ఆదివారంతో బ్యాంకులు బంద్ ఉంటాయి.
  • ఆర్బీఐ నిబంధనల ప్రకారం నెగోషియబుల్ ఇన్ర్ట్సుమెంట్స్ యాక్ట్ కింద సెలవులు, నెగోషియబుల్ ఇన్ర్టుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‏మెంట్ హాలిడే కింద బ్యాంకులు సెలవులను నిర్ణయిస్తారు.

న‌వంబ‌రు లో బ్యాంకు హాలీడేస్:

  • 19వ తేదీ నవంబరు 2021 – కార్తీక పూర్ణిమ / గురునానక్ జయంతి
  • 21వ తేదీ నవంబరు 2021 -ఆదివారం
  • 22వ తేదీ నవంబరు 2021 – కనకదాస జయంతి
  • 23వ తేదీ నవంబరు 2021 – సెంగ్ కుట్స్‌నెమ్
  • 27వ తేదీ నవంబరు 2021 – నాల్గవ శనివారం
  • 28వ తేదీ నవంబరు 2021 – ఆదివారం
Leave A Reply

Your email address will not be published.