అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదు: హోంమంత్రి అనిత

అమరావతి (CLiC2NEWS): అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదని, ఆడపిల్లలో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షిస్తమన్నారు. మచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎనిమిదేళ్ల బాలికపై మైనర్ బాలురు అత్యాచారం చేశారు. బాలిక ఇంట్లో చెబుతోందన్న భయంతో హత్య చేసినట్లు సమాచారం. ఈ కేసులో బాలిక కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. మరో అత్యాచార కేసులో బాలిక పేరుతో రూ. 5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ఆమె వెల్లడించారు.